పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!! | maoist leader arrested by khammam police !! | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!!

Feb 1 2016 8:15 PM | Updated on Aug 20 2018 4:44 PM

మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు సున్నం బొజ్జి అలియాస్ అంజన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

చర్ల: మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు సున్నం బొజ్జి అలియాస్ అంజన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లేందుకు దండకారణ్యం నుంచి సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామానికి చేరుకున్న అంజన్న పోలీసులకు చిక్కినట్లు సమాచారం.

సున్నం బొజ్జి అలియాస్ అంజన్న స్వగ్రామం ఖమ్మం జిల్లా చర్ల మండలం బత్తినిపల్లి గ్రామం. ఆరేళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయిరమణను సంప్రదించగా, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement