నకిలీ వీసాతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్ | Man held with fake visa | Sakshi
Sakshi News home page

నకిలీ వీసాతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

Dec 7 2015 6:21 PM | Updated on Oct 9 2018 5:39 PM

నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన వ్యక్తిని ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ) పోలీసులకు అప్పగించారు.

శంషాబాద్ : నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన వ్యక్తిని ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ) పోలీసులకు అప్పగించారు. ఉపాధి నిమిత్తం ఏజెంట్ ద్వారా నకిలీ వీసా పొందిన ప్రకాశం జిల్లాకు చెందిన ఖాదీర్ బాషా(40) సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లడానికి యత్నిస్తుండగా అతడి వీసాను పరిశీలించిన అధికారులు నకిలీదిగా గుర్తించారు. వెంటనే అతడిని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇమిగ్రేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement