అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ | man have illegal weapons arrested in nalgonda | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్

Oct 28 2015 2:24 PM | Updated on Oct 9 2018 5:39 PM

నల్గొండ జిల్లాలో అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్న ఓ వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నల్గొండ: నల్గొండ జిల్లాలో అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్న ఓ వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలో కిషన్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

నాటు తుపాకి ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఓ నాటు తుపాకి, బుల్లెట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌కుమార్ బీహార్ నుంచి వలస వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement