జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్... | KCR to visit the districts | Sakshi
Sakshi News home page

జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్...

Aug 5 2014 12:26 AM | Updated on Sep 2 2017 11:22 AM

జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్...

జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో, గురువారం నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

మంగళవారం కరీంనగర్, గురువారం నిజామాబాద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో, గురువారం నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో మాత్రమే ఆయన ఒకరోజు పర్యటించారు. రెండు నెలల పాటు ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ ప్రతిరోజూ కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.

గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిన దాదాపు అన్ని అంశాలకు ఆమోద ముద్ర వేసిన తరువాత.. తొలిసారిగా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ప్రాణం పోసిందని, 2001 మే 17వ తేదీన అక్కడ నిర్వహించిన సభ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని కేసీఆర్ అధికారులకు తెలిపారు. కరీంనగర్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, జిల్లా అభివృద్ధి తన బాధ్యత అని సీఎం వివరించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్, అంకాపూర్ వెళ్ళనున్నట్లు వెల్లడించారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement