రైతు గుండెపై కేసీఆర్ పచ్చబొట్టు | KCR tattoo on the heart of Farmer | Sakshi
Sakshi News home page

రైతు గుండెపై కేసీఆర్ పచ్చబొట్టు

Oct 29 2016 3:23 AM | Updated on Oct 1 2018 2:44 PM

రైతు గుండెపై కేసీఆర్ పచ్చబొట్టు - Sakshi

రైతు గుండెపై కేసీఆర్ పచ్చబొట్టు

అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఉండటం పరిపాటి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభిమానిస్తున్న ఓ రైతు ఏకంగా తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

చేగుంట: అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఉండటం పరిపాటి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభిమానిస్తున్న ఓ రైతు ఏకంగా తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అతనికి కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానం.

ఆయన పేరును పచ్చబొట్టు పొడిపించుకోవడానికి చాలా ఊర్లు తిరిగాడు. చివరకు హైదరాబాద్‌లో పచ్చబొట్టు వేసేవారు దొరకడంతో కేసీఆర్ పేరును వేరుుంచుకున్నాడు. తన జీవితంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రి హరీశ్‌రావును కలవాలన్నదే తన కోరిక అని రైతు శ్రీనివాస్ తెలిపాడు. వీరాభిమానం అంటే ఇదేనేమో..

Advertisement
 
Advertisement
Advertisement