కంప చెట్లలో తపంచా | Gun Found in espalier trees | Sakshi
Sakshi News home page

కంప చెట్లలో తపంచా

Apr 12 2016 4:46 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఉపాధి హామీ పనుల్లో భాగంగా కంప చెట్లు తొలగిస్తున్న కూలీలకు ఎప్పటిదో గానీ పాత కాలంనాటి ఓ తపంచా కనిపించింది.

ఉపాధి హామీ పనుల్లో భాగంగా కంప చెట్లు తొలగిస్తున్న కూలీలకు ఎప్పటిదో గానీ పాత కాలంనాటి ఓ తపంచా కనిపించింది. నల్లగొండ జిల్లా గుండాల మండలం పల్లెపాడు గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఈజీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రామన్నపేట సీఐ గంగిరెడ్డి గ్రామానికి చేరుకుని తపంచాను స్వాధీనం చేసుకున్నారు. దానిపైన కెనాన్ అని ఇంగ్లిష్‌లో పేరు ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement