ఎస్బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన | farmers concerned in front sbh | Sakshi
Sakshi News home page

ఎస్బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన

Feb 2 2015 3:29 PM | Updated on Jun 4 2019 5:04 PM

జిల్లాలోని నడిగూడెంలో పంట రుణాలు ఇవ్వాలని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదుట రైతులు ఆందోళన చేశారు.

నల్లగొండ: జిల్లాలోని నడిగూడెంలో పంట రుణాలు ఇవ్వాలని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. గత వారం రోజులుగా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 100 మంది రైతులు బ్యాంక్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
(నడిగూడెం)
 

Advertisement
 
Advertisement
Advertisement