నకిలీ పోలీసుల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నకిలీ పోలీసుల అరెస్ట్

Published Thu, Sep 10 2015 4:22 PM

Fake Cops Arrested in kukatpally

హైదరాబాద్: పోలీసులమని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన కొంతమంది నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది.

 

నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో రోడ్డుపై వెళుతున్న వారిని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 4వేలు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement