డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య | degree student suicide in hyderabad boys hostel | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Nov 20 2015 12:27 PM | Updated on Nov 6 2018 7:56 PM

హైదరాబాద్ బాయ్స్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ బాయ్స్ హాస్టల్‌లో శుక్రవారం ఉదయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన తనూజ్ దేవగన్(20) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తనూజ్ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన రూమ్మేట్స్ హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టంనిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తనూజ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement