కూల్చి కట్టడమే పునర్నిర్మాణమా?: చెరుకు | CHERUKU Sudhakar comments on Cm kcr | Sakshi
Sakshi News home page

కూల్చి కట్టడమే పునర్నిర్మాణమా?: చెరుకు

Oct 27 2016 12:47 AM | Updated on Sep 19 2019 8:44 PM

కూల్చి కట్టడమే పునర్నిర్మాణమా?: చెరుకు - Sakshi

కూల్చి కట్టడమే పునర్నిర్మాణమా?: చెరుకు

తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. ఉన్న భవనాలను కూల్చి మళ్లీ నిర్మించడమేనా? అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

నల్లగొండ రూరల్: తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. ఉన్న భవనాలను కూల్చి మళ్లీ నిర్మించడమేనా? అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. నల్లగొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెక్రటేరియట్, ఉస్మానియా ఆస్పత్రి తదితర భవనాలన్ని కూల్చి వాస్తు పేరిట మళ్లీ నిర్మాణాలు చేపట్టడం ప్రజాధనం దుబారా చేయడమేనన్నారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే.. సీఎం కూతురు, ఎంపీ కవిత గడ్డం, జుంపాలు పెంచుకో అనడం నాయకులను అవమానపర్చడమేనన్నారు. భాష తీరును మార్చుకోవాలని సీఎం కేసీఆర్ తన పిల్లలకు చెప్పుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement