బీసీల డిమాండ్లపై మోడీకి దేవేందర్‌గౌడ్ లేఖ | BC demands Devender letter to Modi | Sakshi
Sakshi News home page

బీసీల డిమాండ్లపై మోడీకి దేవేందర్‌గౌడ్ లేఖ

Aug 7 2014 3:00 AM | Updated on Aug 15 2018 2:20 PM

బీసీల డిమాండ్లపై మోడీకి  దేవేందర్‌గౌడ్ లేఖ - Sakshi

బీసీల డిమాండ్లపై మోడీకి దేవేందర్‌గౌడ్ లేఖ

బీసీల డిమాండ్లను పరిష్కరించే విషయంలో జోక్యం చేసుకోవాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం లేఖ రాశారు.

న్యూఢిల్లీ: బీసీల డిమాండ్లను పరిష్కరించే విషయంలో జోక్యం చేసుకోవాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం లేఖ రాశారు. జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్దత లేకపోవడంతోనే బీసీల సమస్యలకు పరిష్కారం లభించడంలేదన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని, బీసీలకు న్యాయమైన హక్కులందించడానికి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement