విష జ్వరంతో చిన్నారి మృతి | Baby girl dies due to Toxic fever | Sakshi
Sakshi News home page

విష జ్వరంతో చిన్నారి మృతి

Jun 8 2015 7:24 PM | Updated on Sep 28 2018 3:39 PM

వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన 18 నెలల వయసున్న చిన్నారి విష జ్వరం బారిన పడి సోమవారం మృతి చెందింది.

ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన 18 నెలల వయసున్న చిన్నారి విష జ్వరం బారిన పడి సోమవారం మృతి చెందింది. వివరాల ప్రకారం.. నూకల మహేష్, శ్రీదేవి దంపతుల కుమార్తె హాసినికి రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. తల్లిదండ్రులు చిన్నారికి స్థానికంగా వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదు. దాంతో విషజ్వరంతో బాధపడుతున్న చిన్నారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ హాసిని సోమవారం కన్నుమూసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను జ్వరం మింగేసిందని తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement