గ్యాస్ సిలిండర్ పేలుడు: ఇద్దరికి గాయాలు | 2 injured in gas cylinder blast | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలుడు: ఇద్దరికి గాయాలు

Aug 28 2015 1:50 PM | Updated on Apr 3 2019 3:52 PM

గ్యాస్ నింపుతుండగా సిలిండర్‌ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మహబూబ్‌నగర్:  గ్యాస్ నింపుతుండగా సిలిండర్‌ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మండలం కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో సిలిండర్ లో మిగిలి ఉన్న గ్యాస్ ను మరొక సిలిండర్ లో నింపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో సంజయ్(8), భూమిక(10) అనే ఇద్దరు చిన్నారులతో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సంజయ్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement