రేబిస్‌తో బాలుడు మృతి | 10 years old boy dies due to Rabies | Sakshi
Sakshi News home page

రేబిస్‌తో బాలుడు మృతి

May 12 2015 6:18 PM | Updated on Sep 28 2018 3:39 PM

రేబిస్ వ్యాధితో హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదేళ్ల బాలుడు మృతి చెందాడు.

నల్లకుంట (హైదరాబాద్) : రేబిస్ వ్యాధితో హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పొత్తూరు మండలం మాలచింతపల్లి గ్రామానికి చెందిన ఎన్.బాలస్వామి కుమారుడు లెనిన్(10)ను కొద్ది రోజుల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. అయితే రెండు రోజుల నుంచి లెనిన్ వింతగా ప్రవర్తిస్తుండడంతో అతడిని సోమవారం సాయంత్రం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి చికిత్సలు ప్రారంభించారు. కాగా పరిస్థితి విషమించడంతో లెనిన్ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement