సూర్య ‘24’ టైటిల్ మారనుందా | Surya's 24 Title Change | Sakshi
Sakshi News home page

సూర్య ‘24’ టైటిల్ మారనుందా

Apr 12 2015 3:04 AM | Updated on Sep 3 2017 12:10 AM

సూర్య ‘24’ టైటిల్ మారనుందా

సూర్య ‘24’ టైటిల్ మారనుందా

సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘24’కు చిక్కులు ఏర్పడ్డాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘24’కు చిక్కులు ఏర్పడ్డాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి 24 అనే టైటిల్‌ను నిర్ణయించారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ విషయంలో చిక్కులు వచ్చి పడ్డాయి. ఇదే టైటిల్‌తో ఒక హాలీవుడ్ సంస్థ మెగా సీరియల్‌ను రూపొందిస్తోంది. ఆ సీరియల్ ఇండియా ప్రచార హక్కులను బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ ఏకంగా *150 కోట్లకు పొందారట. ఆ సీరియల్ టైటిల్‌తో సూర్య చిత్రం నిర్మించడాన్ని అనిల్‌కుమార్ వ్యతిరేకిస్తున్నారని సమాచారం. దీంతో సూర్య తన చిత్రం టైటిల్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్.

Advertisement
 
Advertisement
Advertisement