లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు

Published Tue, Sep 20 2016 12:50 PM

లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు - Sakshi

యద్దనపూడి : లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీనివాసరావు సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు.

సీఐ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన యువతి గన్నవరంలోని తన సోదరి ఇంటికి వారం క్రితం వచ్చింది. అదే కాలనీకి చెందిన పల్లెపోగు పెద్దన్న శుక్రవారం పూటుగా మద్యం తాగి వచ్చి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పెద్దన్నను గన్నవరం బస్‌షెల్టర్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పర్చూరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలుని రిమ్స్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

Advertisement
Advertisement