వ్యక్తి మూత్రాశయంలో 51 రాళ్లు | Person bladder In the 51 stones | Sakshi
Sakshi News home page

వ్యక్తి మూత్రాశయంలో 51 రాళ్లు

Jan 21 2015 11:23 PM | Updated on Sep 2 2017 8:02 PM

పుణే వైద్యులు ఓ యువకుని మూత్రాశయం నుంచి 51 రాళ్లను శస్త్రచికత్స ద్వారా తొలగించారు.

పింప్రి, న్యూస్‌లైన్ : పుణే వైద్యులు ఓ యువకుని మూత్రాశయం నుంచి 51 రాళ్లను శస్త్రచికత్స ద్వారా తొలగించారు. పుణేలోని ససూన్ ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యులు సుధీర్ దుబే, ఆవిష్కార్ బారసే, వైభవ్ షాహ, పాండే విజయ్ పాటిల్‌ల బందం ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. సంతోష్ హిరవే (21) అనే యువకుడు తరచు మూత్ర సంబంధమైన వ్యాధితో బాధపడుతుండేవాడు.

అతనికి తరచుగా తలనొప్పి కూడా వచ్చేదని వైద్యులు చెప్పారు. అతనికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మూత్రాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు. సంతోష్ తల్లి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ శస్త్ర చికిత్స వీరిపై మరింత ఆర్థిక భారాన్ని మోపింది.

Advertisement
 
Advertisement
Advertisement