వదంతులు నయన సృష్టే | Nayantara's Clarification about Rumors | Sakshi
Sakshi News home page

వదంతులు నయన సృష్టే

May 20 2015 2:45 AM | Updated on Sep 3 2017 2:19 AM

వదంతులు నయన సృష్టే

వదంతులు నయన సృష్టే

ఈ రోజుల్లో ఏ రంగంలో అయినా ప్రచారం అనేది చాలా అవసరం. ఇది గ్రహించిన చాలా మంది రకరకాల ప్రచారాలతో కుస్తీ పడుతుంటారు.

ఈ రోజుల్లో ఏ రంగంలో అయినా ప్రచారం అనేది చాలా అవసరం. ఇది గ్రహించిన చాలా మంది రకరకాల ప్రచారాలతో కుస్తీ పడుతుంటారు. ఇక సినిమా రంగంలో అయితే కొందరు తెలివిగా సెల్ఫ్ ప్రచారం చేసుకుంటుంటారు.సంచలన నటి నయనతార ఇలాంటి ప్రచారాన్నే ఆశిస్తున్నట్లున్నారు. ఒకప్పుడు కోలీవుడ్‌లో ప్రేమ వ్యవహారాల్లో కలకలర  పుట్టించి ఈ భామ కొంత కాలం సెలైంట్‌గా ఉన్నారు. అది అనుభవాల గుణపాఠం ఏమో అనుకున్నారు సినీ వర్గాలు.
 
 నయనతార కూడా ఇకపై నా జీవితంలో ప్రేమకు తావు లేదు అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేశారు. చాలామంది నిజమేనేమో అని అనుకున్నారు.అలాంటిది ఇటీవల నయనతార గురించి ప్రేమ,పేళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు హోరెత్తాయి. యువ దర్శకుడు విఘ్నేష్‌శివన్, నయనతార పెళ్లి చేసుకున్నారనే ఆ ప్రచారాన్ని వారిద్దరూ ఖండించారు. అయితే ఉన్నట్లుండి ఆ వదంతుల్ని ఏవరు పుట్టించారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం.
 
  అయితే ఇప్పుడామెకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. నయన మళ్లీతెలుగులో బిజీ  కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. మళ్లి పెళ్లి వదంతులు ఈ అమ్మడి సృష్టే కావచ్చునని కోలీవుడ్‌లో ఒక వర్గం మాట. అందుకు వాళ్లు చెప్పే రీజన్ నయన టాలీవుడ్ కెళ్లపోతే కోలీవుడ్ తనను మరిచిపోతుందేమోనన్న ఆమె భయం కావచ్చు ,ఇలా వదంతులతో కొంత కాలం ఇక్కడి జనాల్లో ఉండవచ్చుననేది నయనతార ప్లాన్ కావచ్చునంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement