మళ్లీ ప్రేమలోపడ్డ నయన? | Is Nayanthara in love with Vignesh Shivan? | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమలోపడ్డ నయన?

May 13 2015 3:02 AM | Updated on Sep 3 2017 1:54 AM

మళ్లీ ప్రేమలోపడ్డ నయన?

మళ్లీ ప్రేమలోపడ్డ నయన?

కోలీవుడ్‌లో ఇప్పుడో కొత్త ప్రచారం హల్‌చల్ చేస్తోంది. నటి నయనతార మరోసారి ప్రేమలో పడిందన్నదే ఆ తాజా ప్రచారం.

కోలీవుడ్‌లో ఇప్పుడో కొత్త ప్రచారం హల్‌చల్ చేస్తోంది. నటి నయనతార మరోసారి ప్రేమలో పడిందన్నదే ఆ తాజా ప్రచారం. ఈ సంచలన తార ఓ యువ దర్శకుడితో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఆయన ఎవరో కాదు శింబు, వరలక్ష్మి నాయికా నాయకులుగా నటించిన పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన విఘ్నేష్ శివనే నట. సుదీర్ఘకాలం నిర్మాణం జరుపుకున్న పోడాపోడి చిత్రం విడుదలానంతరం మాత్రం ఆడియన్స్‌తో పాటు చిత్ర యూనిట్‌ను నిరాశనే మిగిల్చింది. ఆ ఎఫెక్ట్ శింబు, వరలక్ష్మితో పాటు దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు గట్టిగానే తగిలింది.

 చాలా రోజుల పోరాటం తరువాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు మలి అవకాశం వచ్చింది. దాన్ని నటుడు ధనుష్ కల్పించారు. ఆయన నిర్మిస్తున్న చిత్రం నానుమ్ రౌడీదాన్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కథానాయకుడు, కథానాయకి నయనతార. అంతకుముందు విఘ్నేష్ శివన్ ఎన్నైఅరిందాల్ చిత్రంలో అదారో అదారో పాటతో సహా కొన్ని చిత్రాల్లో పాటలు రాశారన్నది గమనార్హం. ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో చిన్న వేషం వేశారు.

ఇలా ఆయనలోని టాలెంట్‌ను చూసే ధనుష్ దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఉండవచ్చు. అయితే అది విఘ్నేష్ శివన్‌కు పరోక్షంగా నయనతారకు ప్రేమికుడవ్వడానికి దోహదపడి ఉంటుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ చాలా సన్నిహితంగా మెలుగుతున్నట్లు చిత్ర యూనిట్ గుసగుసలు.

అంతేకాదు నయన తన తాజా ప్రేమికుడికి ఒక ఖరీదైన కారును కొనిచ్చారట. అదే విధంగా నయన్ ఇటీవల విఘ్నేష్ శివన్‌తో కలిసి మాల్దీవులకు జాలీ ట్రిప్ వేసి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సారైనా ఈ యువ దర్శకుడితో స్నేహం నయనతారను పెళ్లి పీటలెక్కిస్తుందా? అన్న ప్రశ్నకు పాజిటివ్ రిజల్ట్ వస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement