మా అత్తకు శశికళ చెడ్డపేరు తెచ్చారు | I am the legal heir, Poes Garden should come to me: Jayalalithaa niece Deepa | Sakshi
Sakshi News home page

మా అత్తకు శశికళ చెడ్డపేరు తెచ్చారు

Dec 12 2016 8:32 AM | Updated on Sep 4 2017 10:28 PM

మా అత్తకు శశికళ చెడ్డపేరు తెచ్చారు

మా అత్తకు శశికళ చెడ్డపేరు తెచ్చారు

జయలలిత వారసురాలిని తానేనని, పోయెస్‌ గార్డెన్‌ బంగ్లా తనకే చెందాలని ఆమె మేనకోడలు దీప అన్నారు.

చెన్నై: జయలలిత వారసురాలిని తానేనని, పోయెస్‌ గార్డెన్‌ బంగ్లా తనకే చెందాలని ఆమె మేనకోడలు దీప అన్నారు. శశికళ నటరాజన్‌పై అవినీతి కేసులున్నాయని, అన్నా డీఎంకే పార్టీని నడపడానికి ఆమె సరైన వ్యక్తి కాదని జాతీయ మీడియాతో చెప్పారు. శశికళపై ఉన్న అవినీతి కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దీప గుర్తు చేశారు. ప్రజలు ఆమెను నాయకురాలిగా కోరుకోవడం లేదని చెప్పారు. గొప్ప నాయకురాలైన జయలలితకు శశికళ చెడ్డపేరు తెచ్చారని అన్నారు.

జయలలిత తన ఆస్తులకు సంబంధించి వీలునామా రాయకపోవడంతో ఎవరికి దక్కుతాయనేది ప్రశ్నగా మారింది. జయలలిత మరణానంతరం పోయెస్‌ గార్డెన్‌ ఇంట్లో ఆమె స్నేహతురాలు శశికళ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దీప స్పందించారు. శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని ఆరోపించారు. ఇదిలావుండగా, జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి స్వాధీనం చేసి.. ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ఆమె సోదరి కుమార్తె అమృత డిమాండ్‌ చేసిన విషయం విదితమే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప కాగా..  జయ సొంత చెల్లెలు కుమార్తె అమృత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement