సల్మాన్‌కు రుణపడి ఉంటా | I am indebted to Salman for whatever I am today: Himesh | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు రుణపడి ఉంటా

May 9 2014 10:36 PM | Updated on Aug 17 2018 2:34 PM

సల్మాన్‌కు రుణపడి ఉంటా - Sakshi

సల్మాన్‌కు రుణపడి ఉంటా

నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తన మ్యూజిక్ థ్రిల్లర్ ‘ది ఎక్స్‌పోజ్’ విడుదలకు సన్నద్ధమవుతున్న సంగీత దర్శకుడు, నటుడు హిమేష్ రేషమ్మియా పేర్కొన్నాడు.

నటుడు హిమేశ్
ముంబై: నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తన మ్యూజిక్ థ్రిల్లర్ ‘ది ఎక్స్‌పోజ్’ విడుదలకు సన్నద్ధమవుతున్న సంగీత దర్శకుడు, నటుడు హిమేష్ రేషమ్మియా పేర్కొన్నాడు. సల్మాన్ నిరంతరం తనకు అండగా ఉంటాడన్నాడు. సల్మాన్ నటించిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ సినిమాకి హిమేశ్ సంగీతం సమకూర్చాడు. ఆ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏ హై జల్వా’, ‘దుల్హన్ హం లేజాయేంగే’కూడా హిమేశ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సల్మాన్ కథానాయకుడిగా హిమేశ్ సంగీత దర్శకత్వంలో  2003లో తొలిసారిగా విడుదలైన ‘తేరే నామ్’ కూడా భారీ హిట్ అయ్యింది.

 ‘ఆయన ఓ లెజెండ్. నాకు ఉత్తమ సోదరుడి వంటివాడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇందుకు కారణం నేను ఈరోజు ఈ స్థాయిలో ఉంటానికి సల్మాన్ అండదండలే. సల్మాన్ మంచి మేధావి. కర్తవ్య నిర్వహణ గురించి అతడికి బాగా తెలుసు’ అని శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమేశ్ పేర్కొన్నాడు. ‘ప్రతి సంవత్సరం సల్మాన్ నటనలో కొత్తదనం కనిపిస్తుంది. అందువల్లనే ఇన్నాళ్లు ఈ రంగంలో ఉండగలిగాడు. అందువల్లనే అతడొక సూపర్‌స్టార్. మరో 50 ఏళ్లపాటు సూపర్‌స్టార్‌గానే ఉండిపోతాడు’ అంటూ ప్రశంసించాడు.

‘ది ఎక్స్‌పోజ్’ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర పేరు రవికుమార్ అని చెప్పాడు. ఇర్ఫాన్‌ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని వివరించాడు. ఇర్ఫాన్.. బ్లాక్ మార్కెటీర్ పాత్ర ను పోషించాడన్నాడు. ఇక ఆదిల్ హుస్సేన్ అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపించనున్నాడన్నాడు. ఇది హత్య మిస్టరీ కథాంశమని, 11 మంది అనుమానితులు ఉంటారన్నాడు. ఈ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదలయ్యే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement