బాలికపై లైంగికదాడి | girl sexually assaulted in West Delhi | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి

Dec 25 2014 12:14 AM | Updated on Aug 21 2018 5:46 PM

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పశ్చిమ ఢిల్లీలో చోటు చేసుకొంది.

న్యూస్‌లైన్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పశ్చిమ ఢిల్లీలో చోటు చేసుకొంది.   పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..  సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో నివాసంలో 12వ తరగతి చదువుతున్న బాలిక  కుటంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఉదయాన్నే తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన బాలుడు ఉదయం 10 గంటల సమయంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పొరుగింటికి చెందిన మరో బాలిక అతడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు   నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం సఫ్ధర్‌జంగ్ పోలీసులు ఎఫ్‌ఐర్ నమోదు చేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement