సహకార బ్యాంకుల సిబ్బంది నిరసన | Cooperative Bank employees protest | Sakshi
Sakshi News home page

సహకార బ్యాంకుల సిబ్బంది నిరసన

Nov 18 2016 5:36 PM | Updated on Sep 4 2017 8:27 PM

సహకార బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను తీసుకోవద్దంటూ రిజర్వు బ్యాంకు ఆదేశాలు ఇవ్వడాన్ని ఆ బ్యాంకుల సిబ్బంది నిరసిస్తున్నారు

అశ్వారావుపేట: సహకార బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను తీసుకోవద్దంటూ రిజర్వు బ్యాంకు ఆదేశాలు ఇవ్వడాన్ని ఆ బ్యాంకుల సిబ్బంది నిరసిస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖకు సిబ్బంది తాళాలు వేశారు. రద్దు చేసిన పెద్ద నోట్లను సహకార బ్యాంకులు తీసుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సత్తుపల్లిలోనూ డీసీసీబీ ముందు బ్యాంకు సిబ్బంది, చైర్మన్, రైతులు ఆందోళన నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement