పిల్లలూ.. దుస్తులు ఇలా శుభ్రం చేసుకోవాలి | Cloths Washing Training ZP CEO Karnataka | Sakshi
Sakshi News home page

పిల్లలూ.. దుస్తులు ఇలా శుభ్రం చేసుకోవాలి

Feb 19 2019 12:49 PM | Updated on Feb 19 2019 12:49 PM

Cloths Washing Training ZP CEO Karnataka - Sakshi

దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపుతున్న కవిత

కర్ణాటక, రాయచూరు రూరల్‌: ఇంటిలో ఉన్న కన్నపిల్లల దుస్తులు శుభ్రం చేయాలంటే తలనొప్పిగా మారుతున్న నేటి రోజుల్లో జెడ్పీ సీఈఓ కవితా మన్నికేరి స్వయంగా రంగంలోకి దిగి పిల్లలకు దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించిన ఘటన యాదగిరి జిల్లా లింగేరి మొరార్జి దేశాయి వసతి పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె పాఠశాలను సందర్శించిన సమయంలో చిన్న పిల్లలు బట్టలు శుభ్రం చేసుకోవడానికి పడుతు న్న కష్టాలను చూడలేక ఆమే స్వతహాగా పిల్లలకు దుస్తులను ఎలా పిండుకోవాలో చూపించారు. అనంతరం విద్యార్థులు హాస్టల్‌లో ఏవిధంగా చదువుకుంటున్నారనే విషయంపై కూడా ఆరా తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement