మహిళా పోలీసుతో అసభ్య ప్రవర్తన | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసుతో అసభ్య ప్రవర్తన

Published Thu, Sep 7 2017 10:03 AM

మహిళా పోలీసుతో ఉన్నతాధికారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు రికార్డ్‌ అయిన దృశ్యం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో

సాక్షి, కేకే.నగర్‌ (చెన్నై): తమిళనాడులో నడిరోడ్డుపై మహిళా పోలీసుతో ఓ ఉన్నతాధికారి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్‌ మీడియాలో సంచలనమైంది. కోయంబత్తూరులో మంగళవారం నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)కు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అధిక సంఖ్యలో భద్రత విధుల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌.. మహిళా పోలీసును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించినట్టు వీడియోలో రికార్డైంది. ఆయన పదేపదే ఆమెను అభ్యంతరకరంగా తాకుతూ అనుచితంగా ప్రవర్తించారు.

అధికారి వేధింపులను వీడియో తీసిన కొందరు దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

Advertisement
Advertisement