ఇప్పుడది లేదు | Actress Aishwarya Rajesh act with Glamorous roles | Sakshi
Sakshi News home page

ఇప్పుడది లేదు

Nov 9 2014 3:52 AM | Updated on Apr 3 2019 9:04 PM

ఇప్పుడది లేదు - Sakshi

ఇప్పుడది లేదు

ఇప్పుడు ఆ సమస్య లేద ంటోంది నటి ఐశ్వర్య రాజేష్. ఇంతకీ ఏ విషయం గురించి ఈ బ్యూటీ మాట్లాడుతుందో తెలుసుకుందామా?. గ్రామీణ కథా పాత్రల నటిగా ముద్రవేసుకున్న ఐశ్వర్య

ఇప్పుడు ఆ సమస్య లేద ంటోంది నటి ఐశ్వర్య రాజేష్. ఇంతకీ ఏ విషయం గురించి ఈ బ్యూటీ మాట్లాడుతుందో తెలుసుకుందామా?. గ్రామీణ కథా పాత్రల నటిగా ముద్రవేసుకున్న ఐశ్వర్య ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటోందట. అయితే గ్లామరస్ పాత్రలు తన ఒంటికి సరిపడవు అంటున్న ఈ అమ్మడి చేతిలో నాలుగైదు చిత్రాలు వున్నాయి. వాటివివరాలు ఈమె తెలుపుతూ అట్టకత్తి, పణైయారుం పద్మినియుమ్ చిత్రాల తరువాత నటించిన చిత్రం తిరుడన్ పోలీస్ అని చెప్పింది. ఈ చిత్రంలో మోడరన్ పాత్రే అయినా గ్లామరస్‌గా నటించలేదని పేర్కొంది. నిజం చెప్పాలంటే గ్లామర్ తన శరీర కృతికి నప్పదని తెలిపింది.
 
 తిరుడన్ పోలీసు ఈ నెల 14న తెరపైకి రానుందని చెప్పింది. ప్రస్తుతం కాక్కముట్టై, ఇడంపొరుళ్ ఎవల్, కుట్రుముం దండనైయుం చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. కాక్కముట్టై చిత్రంలో చాలా వైవిధ్యభరిత పాత్ర చేస్తున్నట్లు చెప్పింది. ఇక కుట్రముందండనైయుం, చిత్రంలో ఇంతవరకు పోషించనటువంటి నటనకు సవాల్‌గా నిలిచే పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నటనా ప్రతిభను చాటుకునే మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఇడమ్ పొరుల్ ఎవల్ చిత్రంలో నందినితో కలిసి నటిస్తున్నట్లు చెప్పింది. ఇద్దరు హీరోయిన్ల కథాచిత్రంలో నటిస్తున్నప్పుడు ఎవరి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందనే విషయంలో మనస్పర్థలు ఏర్పడుతుంటాయని అయితే ఇప్పుడా సమస్య లేదని అంది. హీరోయిన్లు ఫ్రెండ్లీగా ఉండటమే ఇందుకు కారణం అని ఐశ్వర్య అంటోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement