బాలికపై వివాహితుడు అత్యాచారం | 17 year old Girl Raped by 31year old Man in karnataka | Sakshi
Sakshi News home page

బాలికపై వివాహితుడు అత్యాచారం

Jun 13 2014 8:30 AM | Updated on Sep 2 2017 8:45 AM

బాలికపై వివాహితుడు అత్యాచారం

బాలికపై వివాహితుడు అత్యాచారం

కామంతో కళ్లు మూసుకు పోయిన వివాహితుడు పక్కింట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపిన దారుణ సంఘటన బుధవారం సాయంత్రం తాలూకా పరిధిలో జరిగింది.

ఇంట్లో జొరబడి ఎత్తుకెళ్లిఅఘాయిత్యం
పోలీసుల అదుపులో కామాంధుడు
 
దొడ్డబళ్లాపురం : కామంతో కళ్లు మూసుకు పోయిన వివాహితుడు పక్కింట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను ఎత్తుకెళ్లి  అత్యాచారం జరిపిన దారుణ సంఘటన బుధవారం సాయంత్రం తాలూకా పరిధిలో జరిగింది.  తాలూకా సమీపంలోని తండాకు చెందిన కామాంధుడు వెంకటేశ్ నాయక్(31)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... వెంకటేశ్ నాయక్ పక్క ఇంటిలో బాలిక (17) తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది.  
 
 తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో బాలిక వంటరిగా ఉన్నట్లు పసిగట్టిన వెంకటేశ్ నాయక్ బాలికను పిలిచి సిగిరెట్లు తీసుకురమ్మని పురమాయించాడు. అయితే బాలిక నిరాకరించింది. కొద్దిసేపు అన ంతరం బాలిక ఇంటి ముందు ఊడ్చుతుండగా వెనుక నుంచి వచ్చిన వెంకటేశ్ నాయక్ నోరు అదిమిపట్టి ఇంటిలోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపాడు. ఘటన తరువాత నిందితుడు పరారీ కాగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement