విజేందర్ మరో నాకౌట్ విజయం | Vijender Singh Beats Francis Cheka in Asia Pacific super middleweight title | Sakshi
Sakshi News home page

విజేందర్ మరో నాకౌట్ విజయం

Dec 17 2016 10:36 PM | Updated on Sep 4 2017 10:58 PM

విజేందర్ మరో నాకౌట్ విజయం

విజేందర్ మరో నాకౌట్ విజయం

ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన అనంతరం పరాజమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్‌ సింగ్‌ మరో నాకౌట్‌ విజయం సాధించాడు.

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన అనంతరం పరాజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్‌ సింగ్‌ మరో నాకౌట్‌ విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్లు్యబీవో) ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ పోరులో నేటి (శనివారం) రాత్రి జరిగిన బౌట్ లో భారత బాక్సర్ విజేందర్‌ సత్తా చాటాడు. డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చెకాతో విజేందర్‌ పది రౌండ్లపాటు జరగాల్సిన ఫైట్‌ లో మాజీ ప్రపంచ చాంపియన్‌ ఫ్రాన్సిస్‌ చెకా (టాంజానియా)తో మూడో రౌండ్లోనే ప్రత్యర్థి చెకాను నాకౌట్ చేసి టైటిల్ నిలబెట్టుకున్నాడు.

పంచ్ విసరడమే నా పని. బౌట్ లో అదే చేయబోతున్నానని చెప్పిన విజేందర్ ఢిల్లీలోని త్యాగరాజ్ స్డేడియం రింగ్ లో తాను చెప్పింది చేసి చూపించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన విజేందర్ ఇప్పటివరకూ 8 విజయాలు సాధించగా, అందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం విశేషం. విజేందర్ పంచ్ లను తట్టుకోలేక మూడో రౌండ్లోనే ఓటమిని అంగీకరించాడు. విజేందర్ ప్రత్యర్థి చెకా 43 ఫైట్లలో తలపడగా 32 విజయాలున్నాయి. ఇందులో 17 నాకౌట్స్‌ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement