శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయాలి: చాందీ | To lift a ban on Sreesanth | Sakshi
Sakshi News home page

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయాలి: చాందీ

Aug 3 2015 12:11 AM | Updated on Sep 3 2017 6:39 AM

స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ పేసర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధాన్ని కొనసాగించడం సరైంది కాదని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అన్నారు...

కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ పేసర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధాన్ని కొనసాగించడం సరైంది కాదని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అన్నారు. బోర్డుది పెద్ద తప్పు అని చెప్పారు. ఈ అంశంలో సరైన న్యాయం జరగడం లేదని శ్రీకి మద్దతుగా మాట్లాడారు. ‘ఈ విషయంలో బీసీసీఐ వైఖరి సరైంది కాదు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి తీర్పును గౌరవిస్తూ నిషేధాన్ని ఎత్తివేయాలి’ అని చాందీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement