చాంపియన్‌ సన్నీత్‌ జంట | Sunneet Pair Got Under 14 Tennis Title | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ సన్నీత్‌ జంట

Mar 28 2019 3:28 PM | Updated on Mar 28 2019 3:28 PM

Sunneet Pair Got Under 14 Tennis Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాంపియన్‌షిప్‌ సిరీస్‌ అండర్‌–14 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సరోజిని అకాడమీ ప్లేయర్‌ సన్నీత్‌ ఉప్పాటి సత్తా చాటాడు. తన భాగస్వామి వేదాంత్‌తో కలిసి డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టైటిల్‌పోరులో సన్నీత్‌–వేదాంత్‌ ద్వయం 7–6 (7/5), 6–4తో విఘ్నేశ్‌–శ్రీహరి జంటపై విజయం సాధించింది. 90 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో సన్నీత్‌ బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సన్నీత్‌ జోడీ 4–1, 4–0తో అనీశ్‌ జైన్‌–నైషక్‌రెడ్డి జంటపై, క్వార్టర్స్‌లో 4–2, 4–1తో క్రిస్‌ మామిల్టన్‌ రాస్‌–విజయ్‌ సారథి జోడీపై గెలుపొందింది. ఈ టోర్నమెంట్‌లో తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

డబుల్స్‌ టైటిల్‌ సాధించిన సన్నీత్‌ను సరోజిని క్రికెట్‌ అకాడమీ కార్యదర్శి జి. కిరణ్‌ రెడ్డి, ఐటీ కమిషనర్‌ (అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ విజిలెన్స్‌) పీయూశ్‌ సోన్‌కర్‌ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. చైతన్య విద్యాలయలో ఎనిమిదో తరగతి చదువుతోన్న సన్నీత్‌ కోచ్‌లు పురుషోత్తం, ఇమ్రాన్, బోలాసింగ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు.   

Advertisement
 
Advertisement
Advertisement