షూటర్ మేరాజ్‌కు రియో బెర్త్
వెటరన్ స్కీట్ షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్ తన కెరీర్‌లో తొలిసారిగా ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకున్నాడు
న్యూఢిల్లీ : వెటరన్ స్కీట్ షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్ తన కెరీర్‌లో తొలిసారిగా ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. 40ఏళ్ల ఈ షూటర్ ఇటలీలోని లొనాటోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 122 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అయితే తనకన్నా ముందున్న ఆరుగురు ఇప్పటికే బెర్త్ దక్కించుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న రెండు స్థానాల్లో మేరాజ్ ఒక్క టి దక్కించుకున్నాడు.
రియో ఒలింపిక్స్ షాట్‌గన్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి బెర్త్. షూటింగ్‌లో ఇప్పటికే ఏడు ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్న భార త్.. చివరి కోటా కోసం నవంబర్‌లో జరిగే ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆడాల్సి ఉంది.


