శ్రీలంక 69/4

Shah picks two as Sri Lanka 69-4, lead by 66

అబుదాబి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి డే నైట్‌ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. మూడు పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 69 పరుగులు చేసింది.

ప్రస్తుతం 66 పరుగుల ఆధిక్యంలో ఉన్న శ్రీలంక చేతిలో ఇంకా ఆరు వికెట్లున్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 266/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 422 పరుగులకు ఆలౌటై మూడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top