టాప్‌ సీడ్‌గా సంజన | Sanjana Sirimalla as Top Seed in Under 16 Tennis Tourney | Sakshi
Sakshi News home page

టాప్‌ సీడ్‌గా సంజన

May 20 2019 10:13 AM | Updated on May 20 2019 10:13 AM

Sanjana Sirimalla as Top Seed in Under 16 Tennis Tourney - Sakshi

ముంబై: మహారాష్ట్ర స్టేట్‌ లాన్‌టెన్నిస్‌ అసోసియేషన్‌ (ఎంఎస్‌ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరగనున్న రమేశ్‌ దేశాయ్‌ స్మారక సీసీఐ ఆలిండియా అండర్‌–16 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగనుంది. నేటి నుంచి ఇక్కడ జరుగనున్న ఈ టోర్నీలో మరో తెలంగాణ అమ్మాయి వేదరాజు ప్రపూర్ణకు నాలుగో సీడింగ్‌ దక్కింది. ఆదివారం ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన సీడెడ్‌ ప్లేయర్ల జాబితాను విడుదల చేశారు.

బాలికల అండర్‌–16 సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ క్రీడాకారిణి సంజన టాప్‌ సీడ్‌గా, భారత ఐదో ర్యాంకర్‌ రెనీ సింగ్‌ (రాజస్తాన్‌) రెండో సీడ్‌గా, ఎనిమిదో ర్యాంకర్‌ రుతుజా చపల్కర్‌ (మహారాష్ట్ర) మూడో సీడ్‌గా బరిలో దిగనున్నారు. బాలుర విభాగంలో టాప్‌–10లో తెలంగాణ    క్రీడాకారులెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. అస్సాం ప్లేయర్‌ ఉదిత్‌ గొగోయ్‌కు టాప్‌ సీడింగ్‌ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement