ఈడెన్‌లో సచిన్ 200వ టెస్టు! | sachin 200 test @ eden gardens | Sakshi
Sakshi News home page

ఈడెన్‌లో సచిన్ 200వ టెస్టు!

Sep 30 2013 2:15 AM | Updated on Sep 1 2017 11:10 PM

ఈడెన్‌లో సచిన్ 200వ టెస్టు!

ఈడెన్‌లో సచిన్ 200వ టెస్టు!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టును చరిత్రాత్మక ఈడెన్‌గార్డెన్స్‌లో ఆడే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ అంశంపై చర్చించారని... ఈడెన్‌లోనే సచిన్ రికార్డు టెస్టు జరిగే అవకాశం ఉందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజీవ్ శుక్లా నేతృత్వంలోని టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీ అక్టోబరు 3న సమావేశం కానుంది.

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టును చరిత్రాత్మక ఈడెన్‌గార్డెన్స్‌లో ఆడే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ అంశంపై చర్చించారని... ఈడెన్‌లోనే సచిన్ రికార్డు టెస్టు జరిగే అవకాశం ఉందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజీవ్ శుక్లా నేతృత్వంలోని టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీ అక్టోబరు 3న సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత... సచిన్ 200వ టెస్టు ఎక్కడ ఆడేది అధికారికంగా ప్రకటిస్తారు. మాస్టర్ 199వ టెస్టును అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో భారత పర్యటనపై ఇంకా అనిశ్చితి తొలగలేదు.
 
  ఏజీఎంలో ఈ అంశం గురించి చర్చే జరగలేదు. ‘సఫారీ పర్యటన నేటి సమావేశంలో చర్చకే రాలేదు. ఈ అంశంపై అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని గతంలోనే దక్షిణాఫ్రికా బోర్డుకు సంజయ్ పటేల్ చెప్పారు. కాబట్టి ఇక అంతా శ్రీనివాసన్ ఇష్టమే’ అని బోర్డు వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement