'మిస్టర్‌ కూల్‌'కు మందలింపు | MS Dhoni violates IPL Code of Conduct, reprimanded | Sakshi
Sakshi News home page

'మిస్టర్‌ కూల్‌'కు మందలింపు

Apr 7 2017 4:14 PM | Updated on Sep 5 2017 8:11 AM

'మిస్టర్‌ కూల్‌'కు మందలింపు

'మిస్టర్‌ కూల్‌'కు మందలింపు

ఐపీఎల్‌ లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని నిబంధనలు ఉల్లంఘించాడు.

పుణె: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని నిబంధనలు ఉల్లంఘించాడు. ముంబై ఇండియన్స్ తో గురువారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్ లో 'మిస్టర్ కూల్' నిబంధనలు అతిక్రమించాడని ఐపీఎల్ అధికార ప్రకటనలో తెలిపింది. అతడిని మ్యాచ్‌ రిఫరీ మందలించాడని వెల్లడించింది.

'ఎంఎస్ ధోని ఐపీఎల్ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ లో లెవల్ వన్‌ (ఆర్టికల్‌ 2.1.1) అతిక్రమణకు పాల్పడ్డాడు. క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించేలా అతడు వ్యవహరించాడు. దీనిపై మ్యాచ్‌ రిఫరీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడాల'ని ఐపీఎల్‌ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ధోనిని మ్యాచ్ రిఫరీ ఎందుకు మందలించారో వెల్లడించలేదు. గతరాత్రి జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్‌ పై పుణె ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ధోని (12 బంతుల్లో 12‌; 1 ఫోర్‌)  నాటౌట్‌ గా నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement