షరపోవా మళ్లీ సాధించెన్‌... | Maria Sharapova wins 1st title since doping ban | Sakshi
Sakshi News home page

షరపోవా మళ్లీ సాధించెన్‌...

Oct 16 2017 1:38 AM | Updated on Oct 16 2017 3:36 AM

Maria Sharapova wins 1st title since doping ban

రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో ఆదివారం జరిగిన తియాన్‌జిన్‌ ఓపెన్‌లో షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 7–5, 7–6 (8/6)తో అర్యానా సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది.

గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరాగమనం చేసింది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్‌ ఓపెన్‌లో టైటిల్‌ గెలిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement