అమృత్‌రాజ్‌కు చుక్కెదురు | 'IT' canceled CATL contract | Sakshi
Sakshi News home page

అమృత్‌రాజ్‌కు చుక్కెదురు

Aug 23 2017 12:54 AM | Updated on Sep 12 2017 12:46 AM

భారత మాజీ ఆటగాడు విజయ్‌ అమృత్‌రాజ్‌ ఆధ్వర్యంలోని చాంపియన్స్‌ టెన్నిస్‌ లీగ్‌

సీటీఎల్‌ కాంట్రాక్ట్‌ రద్దు చేసిన ‘ఐటా’  

న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు విజయ్‌ అమృత్‌రాజ్‌ ఆధ్వర్యంలోని చాంపియన్స్‌ టెన్నిస్‌ లీగ్‌ (సీటీఎల్‌)కు బ్రేక్‌ పడింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు సీటీఎల్‌ కాంట్రాక్ట్‌ను అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) రద్దు చేసింది. ఒప్పందం ప్రకారం విరామం లేకుండా వరుసగా తొమ్మిదేళ్ల పాటు సీటీఎల్‌ను నిర్వహించాల్సి ఉంది.

పైగా కాంట్రాక్ట్‌ ఫీజు రూ. 30 లక్షలతో పాటు లాభాల్లో 10 శాతాన్ని కూడా ‘ఐటా’కు చెల్లించాలి. అయితే గత ఏడాది సీటీఎల్‌ను నిర్వహించలేకపోయిన అమృత్‌రాజ్‌ బృందం ఫీజును కూడా చెల్లించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement