కోల్‌కతా 5 హైదరాబాద్‌ 0  | ISL 2020 ATK Registered Mighty Victory Over Hyderabad FC | Sakshi
Sakshi News home page

కోల్‌కతా 5 హైదరాబాద్‌ 0 

Oct 26 2019 7:48 AM | Updated on Oct 26 2019 7:48 AM

ISL 2020 ATK Registered Mighty Victory Over Hyderabad FC - Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో తొలిసారి అడుగు పెట్టిన హైదరాబాద్‌ పుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టుకు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయం ఎదురైంది. మాజీ చాంపియన్‌ అట్లెటికో డి కోల్‌కతా (ఏటీకే)తో ఇక్కడి సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 0–5 గోల్స్‌ తేడాతో ఓటమి చవిచూసింది. గోల్స్‌ పరంగా ఐఎస్‌ఎల్‌లో కోల్‌కతా జట్టుకిదే పెద్ద విజయం. 2015లో గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4–0తో నెగ్గింది. తాజా గెలుపుతో కోల్‌కతా ఆ రికార్డును సవరించింది. హైదరాబాద్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున డేవిడ్‌ విలియమ్స్‌ (25వ, 44వ నిమిషాల్లో), గార్సియా (88వ, 90+4వ నిమిషంలో) చెరో రెండు గోల్స్‌ చేయగా... కృష్ణా రాయ్‌ (27వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. మ్యాచ్‌లో బంతి ఎక్కువ శాతం కోల్‌కతా ఆధీనంలోనే ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఒడిశాతో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ జట్టు తలపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement