రియోకు పయనమైన హాకీ జట్టు | Indian hockey team leaves for Rio Olympics | Sakshi
Sakshi News home page

రియోకు పయనమైన హాకీ జట్టు

Jul 24 2016 7:21 PM | Updated on Sep 4 2017 6:04 AM

రియోకు పయనమైన హాకీ జట్టు

రియోకు పయనమైన హాకీ జట్టు

వచ్చే నెలలో రియోలో జరుగనున్న ఒలింపిక్స్ కు భారత పురుషుల హాకీ జట్టు పయనమైంది.

బెంగళూరు: వచ్చే నెలలో రియోలో జరుగనున్న ఒలింపిక్స్ కు భారత పురుషుల హాకీ జట్టు పయనమైంది. దీనిలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున భారత హాకీ జట్టు ముందుగా స్పెయిన్ కు చేరుకుంది. ఆ జట్టుతో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడిన అనంతరం అక్కడ నుంచి రియోకు చేరుతుంది.

 

'రియోకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడే అవకాశం రావడం కచ్చితంగా లాభిస్తుంది. మాడ్రిడ్లో తగినంత ప్రాక్టీస్ లభిస్తుందని ఆశిస్తున్నా. ఈ నెల 29న మాడ్రిడ్ నుంచి రియోకు వెళతాం. రియో ఒలింపిక్స్ కోసం జట్టులోని ఆటగాళ్లు ఆతృతగా ఉన్నాం. ఏ విధమైన సవాల్నైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటీవల కాలంలో భారత జట్టు అనేక విజయాలను సొంతం చేసుకోవడం కూడా మాకు బాగా కలిసొస్తుంది. అక్కడకు వచ్చే ప్రపంచ అత్యుత్తమ జట్లతో తలపడి మమ్మల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది'అని కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ పేర్కొన్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement