ఫైనల్లో పుణే, ఢిల్లీ | In the final, Pune, Delhi | Sakshi
Sakshi News home page

ఫైనల్లో పుణే, ఢిల్లీ

Nov 25 2014 12:56 AM | Updated on Sep 2 2017 5:03 PM

ఫైనల్లో పుణే, ఢిల్లీ

ఫైనల్లో పుణే, ఢిల్లీ

చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు చుక్కెదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏసెస్ 24-25 గేమ్‌ల తేడాతో పుణే మరాఠాస్ చేతిలో ఓటమిపాలైంది.

చాంపియన్స్ టెన్నిస్ లీగ్

 పుణే: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు చుక్కెదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏసెస్ 24-25 గేమ్‌ల తేడాతో పుణే మరాఠాస్ చేతిలో ఓటమిపాలైంది. లీగ్ దశ ముగిసిన అనంతరం సౌత్‌జోన్‌నుంచి అగ్ర స్థానంలో నిలిచిన పుణే తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ పోరులో... లెజెండ్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు మార్క్ ఫిలిప్పోసిస్ 6-3తో ప్యాట్ క్యాష్‌ను చిత్తు చేశాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో పుణే జోడి బాగ్దాటిస్-రద్వాన్‌స్కా 6-3 తేడాతో యూజ్నీ-హింగిస్‌పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో హింగిస్ (ఏసెస్) 6-4తో రద్వాన్‌స్కాను ఓడించింది.  పురుషుల డబుల్స్‌లో బాగ్దాటిస్-సాకేత్ మైనేని 6-3తో యూజ్నీ-జీవన్(ఏసెస్)పై గెలుపొందారు. చివరి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో యూజ్నీ 6-5తో బాగ్దాటిస్‌ను ఓడించాడు. దీంతో ఇరు జట్లు 24-24 గేమ్‌లతో సమంగా నిలిచాయి. కానీ టైబ్రేక్‌లో బాగ్దాటిస్‌ను విజయం వరించింది. రేపు జరిగే ఫైనల్లో ఢిల్లీ డ్రీమ్స్‌తో పుణే తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement