‘ఇమ్రాన్‌ఖాన్‌కు నీతి, నిజాయితీ లేదు’ | Imran is not honest and righteous, Estranged wife Reham Khan | Sakshi
Sakshi News home page

‘ఇమ్రాన్‌ఖాన్‌కు నీతి, నిజాయితీ లేదు’

Jun 5 2018 2:17 PM | Updated on Jun 5 2018 4:25 PM

Imran is not honest and righteous, Estranged wife Reham Khan - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్‌కు అసలు నీతి, నిజాయితీ లేదంటూ మండిపడ్డారు. తనను రెండో వివాహం చేసుకున్నసంగతిని దాచిపెట్టిన ఇమ్రాన్‌ఖాన్‌.. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టు రెహంఖాన్‌ను 2015లో పెళ్లిచేసుకున్నఇమ్రాన్‌.. పదినెలలకే ఆమెతో విడిపోయి మరో పెళ్లి చేసుకున్నా ఆ కాపురం రెండు నెలలే సాగింది. ఎన్నికలకు ముందే ఇమ్రాన్‌ వ్యవహారంపై పుస్తకం తెచ్చేపనిలో ఉన్నారు రెహమ్‌ ఖాన్‌. అయితే రెహమ్‌ ఖాన్‌ ఆటో బయోగ్రఫీని అడ్డుకునేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు దారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఏది ఏమైనా ఆ పుస్తకాన్ని బయటకు తెస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు రెహమ్‌ ఖాన్‌.

1995లో బ్రిటన్‌ బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్‌.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015లో బీబీసీ జర్నలిస్ట్‌ రెహమ్‌ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా తొమ్మిది నెలలకే ఆ బంధమూ తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్‌ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే బుష్రా.. ఇమ్రాన్‌తో విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement