హారిక సంచలనం | harika Sensation in Isle of Man International Chess Tournament | Sakshi
Sakshi News home page

హారిక సంచలనం

Oct 8 2016 12:27 AM | Updated on Sep 4 2017 4:32 PM

ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంచలనం సృష్టించింది. మహిళల ప్రపంచ నంబర్‌వన్,

సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంచలనం సృష్టించింది. మహిళల ప్రపంచ నంబర్‌వన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా)పై హారిక తన కెరీర్‌లో తొలిసారి విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 45 ఎత్తుల్లో హు ఇఫాన్‌ను ఓడించింది.

ఈ గేమ్‌కు ముందు హు ఇఫాన్‌తో హారిక 19 సార్లు తలపడగా... నాలుగు గేముల్లో ఓడిపోయి, 15 గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో ఏడో రౌండ్ తర్వాత హారిక ఖాతాలో ఐదు పాయి0ట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement