ముంబైని గెలిపించిన చెత్రి | good performance in Mumbai chetri | Sakshi
Sakshi News home page

ముంబైని గెలిపించిన చెత్రి

Oct 22 2015 12:37 AM | Updated on Sep 3 2017 11:18 AM

ముంబైని గెలిపించిన చెత్రి

ముంబైని గెలిపించిన చెత్రి

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ముంబై ఫుట్‌బాల్ క్లబ్

ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ముంబై ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై స్థానిక డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 2-0 గోల్స్ తేడాతో ఢిల్లీ డైనమోస్ జట్టును ఓడించింది.

భారత కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్ చేసి ముంబై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆట 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన చెత్రి, 74వ నిమిషంలో రెండో గోల్ అందించాడు. నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై ఒక మ్యాచ్‌లో నెగ్గి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయింది. గురువారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో గోవా ఎఫ్‌సీ తలపడుతుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement