నార్త్‌ఈస్ట్‌పై గోవా గెలుపు | FC Goa Ease Past NorthEast United | Sakshi
Sakshi News home page

నార్త్‌ఈస్ట్‌పై గోవా గెలుపు

Jan 9 2020 12:37 AM | Updated on Jan 9 2020 12:37 AM

 FC Goa Ease Past NorthEast United - Sakshi

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌–6లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా 2–0తో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీపై గెలుపొందింది. ఫలితంగా సీజన్‌లో ఏడో గెలుపును నమోదు చేసిన గోవా 24 పాయింట్లతో ‘టాప్‌’ స్థానంలోకి దూసుకెళ్లింది. 67వ నిమిషంలో జాకీ చంద్‌ సింగ్‌ కొట్టిన పాస్‌ను అడ్డుకోబోయిన నార్త్‌ఈస్ట్‌ ప్లేయర్‌ కొమోస్కీ నేరుగా తమ గోల్‌పోస్టులోకే బంతిని పంపి సెల్ఫ్‌ గోల్‌తో ప్రత్యర్థి ఖాతాను తెరిచాడు. 82వ నిమిషంలో పెనాలీ్టని గోల్‌గా మలిచిన ఫెరాన్‌ కొరొమినాస్‌ గోవాకు 2–0తో విజయాన్ని ఖాయం చేశాడు. 80వ నిమిషంలో ప్రత్యరి్థని దురుసుగా అడ్డుకున్న నార్త్‌ఈస్ట్‌ ప్లేయర్‌ డేవిడ్‌ రెడ్‌ కార్డ్‌ పొంది మైదానాన్ని వీడాడు. నేటి మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీతో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ తలపడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement