అక్షరాలా 61 లక్షలు! | Donald Bradman blazer sells | Sakshi
Sakshi News home page

అక్షరాలా 61 లక్షలు!

Sep 8 2015 12:58 AM | Updated on Sep 3 2017 8:56 AM

క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌కు సంబంధించి ఏ వస్తువు అయినా అభిమానులకు అపురూక కానుకవంటిదే...

బ్రాడ్‌మన్ బ్లేజర్  విలువ
సిడ్నీ:
క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌కు సంబంధించి ఏ వస్తువు అయినా అభిమానులకు అపురూక కానుకవంటిదే. ఉజ్వల కెరీర్‌లో ఆయన వాడిన బ్యాట్ మొదలు టోపీ వరకు అమ్మకానికి పెడితే వారు ఎగబడి కొనేందుకు సిద్ధమవుతారు. తాజాగా 1936-37 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ వేసుకున్న బ్లేజర్‌ను సోమవారం వేలానికి ఉంచారు. డాన్ తొలిసారి ఈ సిరీస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ బ్లేజర్‌కు అనూహ్యంగా వేలంలో 1 లక్షా 32 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ. 61 లక్షలు) విలువ పలికింది. నిర్వాహకుల అంచనాలకు మించి ఒక వీరాభిమాని దీనిని సొంతం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement