దివ్యా రెడ్డికి మూడు స్వర్ణాలు | Divya Reddy Wins Three Gold Medals in Telangana Masters Athletic Championship | Sakshi
Sakshi News home page

దివ్యా రెడ్డికి మూడు స్వర్ణాలు

Jun 3 2019 8:42 AM | Updated on Jun 3 2019 11:14 AM

Divya Reddy Wins two Gold Medals in Telangana Masters Athletic Championship - Sakshi

దివ్యా రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మాస్టర్స్‌ మహిళల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి మూడు స్వర్ణాలతో మెరిసారు. 40 ప్లస్‌ వయో విభాగంలో పోటీపడిన ఆమె 400, 800,1500 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచారు. 400 మీ. పరుగు పోటీని దివ్య ఒక నిమిషం 22.2 సెకన్లలో పూర్తి చేశారు. ఇందులో కృతి (1ని:30.1 సెకన్లు), ఉమా గుప్తా (1ని:40.5 సె.) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. 800 మీటర్ల విభాగంలో 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేశారు. అనంతరం 1500 మీటర్ల పరుగును దివ్య అందరికంటే ముందుగా 7 నిమిషాల 03 సెకన్లలో పూర్తి చేశారు. కృతి (7ని:21.3 సె.)కి రజతం దక్కింది. 45 ప్లస్‌ వయో విభాగం జరిగిన లాంగ్‌జంప్‌లో కృష్ణవేణి బంగారు పతకం సాధించారు. ఆమె 2.42 మీటర్ల దూరంలో దూకి విజయం సాధించగా, కుసుమ (2.40 మీ.) రజతంతో తృప్తిపడ్డారు. 

ఇతర పోటీల ఫలితాలు 
35 ప్లస్‌ వయో విభాగం: 100 మీ. పరుగు: 1. ప్రియాంక, 2. సరిత, 3. విజయ; 200 మీ. పరుగు: 1. విజయ, 2. సంధ్య, 3. ఉమ; 1500 మీ. పరుగు: 1. సంధ్య, 2. ఇందు; లాంగ్‌జంప్‌: 1. ప్రియాంక, 2. విజయ, 3. సమత; షాట్‌పుట్‌: 1. అశ్విని, 2. ప్రమీల, 3. ప్రియాంక; డిస్కస్‌ త్రో: 1. ప్రమీల, 2. అశ్విని; 3. కమల; జావెలిన్‌ త్రో: 1. రోజా, 2. శశిరేఖ, 3. వినీశ; హ్యామర్‌ త్రో: 1. రోజా, 2.ప్రమీల, 3. శశిరేఖ; 5000 మీ. రేస్‌వాక్‌: 1. అరుణ, 2. విజయ, 3. జయలక్ష్మి. 

40 ప్లస్‌ విభాగం: 100 మీ. పరుగు: 1.ఉమా గుప్తా, 2. కృష్ణవేణి; 200 మీ. పరుగు: 1. ఉమా గుప్తా, 2. రోజా, 3. శకుంతల; లాంగ్‌జంప్‌: 1. విజయ, 2. కృష్ణవేణి; షాట్‌పుట్‌: 1.వర్జినియా బెన్సమ్, 2. షాలిని; డిస్కస్‌ త్రో: 1. సునీత, 2. కుసుమ, 3.స్వరూప; జావెలిన్‌ త్రో: 1.ప్రిస్కిలా, 2. మేరి, 3.స్నేహలత; హ్యామర్‌ త్రో: 1. అల్తియా, 2. ప్రిస్కిలా; 5000 మీ. రేస్‌వాక్‌: 1. శకుంతల, 2. కృష్ణవేణి, 3. స్నేహలత. 
45 ప్లస్‌ విభాగం: 100 మీ. పరుగు: 1. సుమ, 2. జ్యోతి, 3. కృష్ణవేణి; 200 మీ. పరుగు: 1. సుమ, 2. జ్యోతి, 3. తులసి; 1500 మీ. పరుగు: 1. తులసి, 2. జ్యోతి; లాంగ్‌జంప్‌: 1. కృష్ణవేణి, 2. కుసుమ; షాట్‌పుట్‌: 1.కుసుమ; షాట్‌పుట్‌ 50 ప్లస్‌: 1. భాను; డిస్కస్‌ త్రో: 1. సునీత, 2. కుసుమ; జావెలిన్‌ త్రో: 1.సుమ, 2. సునీత; హ్యామర్‌ త్రో: 1. కుసుమ, 2. సునీత. 

50 ప్లస్‌ విభాగం: 100 మీ. పరుగు: 1. శాంత, 2. సలోమి; డిస్కస్‌ త్రో: 1. భాను, 2. అనితారాణి, 3. రూపా ఠాకూర్‌; జావెలిన్‌ త్రో: 1. భాను,       2. వరలక్ష్మి; 5000 మీ. రేస్‌వాక్‌: 1.శాంత,          2. అనితారాణి.  

60 ప్లస్‌ విభాగం: 100 మీ. పరుగు: 1.శారద, 2. దుర్గ; డిస్కస్‌ త్రో: 1. దేబర, 2. డార్కస్, 3. శారద; జావెలిన్‌ త్రో: 1. దేబర, 2. డార్కస్‌; షాట్‌పుట్‌: 1. దేబర రేమండ్, 2. డార్కస్‌; 5000 మీ. రేస్‌వాక్‌: 1. శారద; 70 ప్లస్‌: 1. దుర్గ.  

Advertisement
 
Advertisement
Advertisement