భారత్‌ను గెలిపించిన దీపిక | Deepika to win India team | Sakshi
Sakshi News home page

భారత్‌ను గెలిపించిన దీపిక

Feb 22 2016 12:00 AM | Updated on Sep 3 2017 6:07 PM

భారత మహిళల హాకీ జట్టు... దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో మొదలుపెట్టింది.

కేప్ టౌన్: భారత మహిళల హాకీ జట్టు... దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో మొదలుపెట్టింది. తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-0తో సఫారీలపై నెగ్గింది. టీమిండియా తరఫున దీపిక (55వ ని.లో) గోల్ చేసింది. ఆరంభంలో ఇరుజట్లు రక్షణాత్మకంగా ఆడుతూ పరస్పరం తమ ఆటతీరును అంచనా వేసుకున్నాయి. మ్యాచ్ మొత్తం మిడ్‌ఫీల్డ్‌లోనే సాగగా, రెండు జట్లు తమ డిఫెన్సివ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. దీంతో తొలి అర్ధభాగం గోల్ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్‌లో దూకుడును చూపెట్టినా... అవకాశాలను సృష్టించుకోవడంలో రెండు జట్లూ విఫలమయ్యాయి. చివరి క్వార్టర్‌లో భారత్ మరింత అటాకింగ్ చేయడంతో 55వ నిమిషంలో పెనాల్టీ రూపంలో తొలి అవకాశం లభించింది. దీన్ని దీపిక అద్భుతమైన గోల్‌గా మల్చడంతో విజయం  భారత్ సొంతమైంది.

Advertisement
 
Advertisement
Advertisement