అనురాగ్ ఠాకూర్ ఎంపికకు రంగం సిద్ధం | Anurag Thakur poised to take over as BCCI president | Sakshi
Sakshi News home page

అనురాగ్ ఠాకూర్ ఎంపికకు రంగం సిద్ధం

May 22 2016 12:58 AM | Updated on Sep 4 2017 12:37 AM

అనురాగ్ ఠాకూర్ ఎంపికకు రంగం సిద్ధం

అనురాగ్ ఠాకూర్ ఎంపికకు రంగం సిద్ధం

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐకి నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎంపిక కాబోతున్నారు.

ముంబై: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐకి నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎంపిక కాబోతున్నారు. తద్వారా బోర్డు చరిత్రలోనే ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ రికార్డు సృష్టించనున్నారు. నేడు (ఆదివారం) జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో సభ్యులు ఠాకూర్‌కు మద్దతు ఇవ్వనున్నారు. శనివారం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఆనవాయితీ ప్రకారం ఈసారి ఈస్ట్ జోన్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా బెంగాల్, అస్సాం, జార్ఖండ్, త్రిపుర, జాతీయ క్రికెట్ క్లబ్ సంఘాలు మద్దతిస్తున్నాయి. ఠాకూర్ ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేసే సామర్థ్యం లేని కారణంగానే పదవి నుంచి తప్పుకున్నట్టు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. తనకన్నా సమర్థులు బోర్డులో ఉన్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement