ఆంధ్ర X మహారాష్ట్ర | Andhra vs Maharashtra | Sakshi
Sakshi News home page

ఆంధ్ర X మహారాష్ట్ర

Feb 11 2015 1:01 AM | Updated on Oct 8 2018 6:08 PM

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఈనెల 16 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

16 నుంచి రంజీ క్వార్టర్స్
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఈనెల 16 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మంగళవారం విడుదలైన ‘డ్రా’ ప్రకారం ఆంధ్ర జట్టు మహారాష్ట్రను ఎదుర్కోనుంది. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న కైఫ్ సేన క్వార్టర్స్‌లో అదే జోరును చూపాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈనెల 25 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి. తొలి రెండు క్వార్టర్స్ విజేతల మధ్య సెమీస్ బెంగళూరులో.. మూడు, నాలుగు మ్యాచ్‌ల మధ్య విజేతలు సెమీస్ కోల్‌కతాలో జరుగుతాయి. మార్చి 8 నుంచి ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
 
క్వార్టర్ ఫైనల్స్ ‘డ్రా’
కర్ణాటక x అస్సాం (ఇండోర్‌లో); ఢిల్లీ x ముంబై (కటక్‌లో); విదర్భ x తమిళనాడు (జైపూర్‌లో); ఆంధ్ర x మహారాష్ట్ర (లాహిలో).

Advertisement
 
Advertisement
Advertisement