ఆంధ్ర 160/3 | Andhra 160/3 | Sakshi
Sakshi News home page

ఆంధ్ర 160/3

Dec 22 2014 1:13 AM | Updated on Sep 2 2017 6:32 PM

సర్వీసెస్‌తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో తొలిరోజు ఆంధ్ర బ్యాట్స్‌మెన్ రాణించారు.

సర్వీసెస్‌తో రంజీ మ్యాచ్
 న్యూఢిల్లీ: సర్వీసెస్‌తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో తొలిరోజు ఆంధ్ర బ్యాట్స్‌మెన్ రాణించారు. ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేశారు. పొగమంచు కారణంగా తొలి రోజు 60 ఓవర్ల ఆట సాధ్యమైంది. టాస్ గెలిచిన సర్వీసెస్ జట్టు ఆంధ్రకు బ్యాటింగ్ అప్పగించింది.
 
  ఓపెనర్ భరత్ (72 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 47) రాణించగా... ప్రశాంత్ కుమార్ (28 బంతుల్లో 2 ఫోర్లతో 14), చిరంజీవి (111 బంతుల్లో 4 ఫోర్లతో 31) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఏజీ ప్రదీప్ (99 బంతుల్లో 6 ఫోర్లతో 47 బ్యాటింగ్), రాకేశ్ (52 బంతుల్లో 2 ఫోర్లతో 15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సర్వీసెస్ బౌలర్లలో సూరజ్ యాదవ్, రోషన్ రాజ్, సౌరభ్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement